Chinab Railway Bridge, Jammu Kashmir
జమ్ము కాశ్మీర్ ను ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టులకి ఇండియా గవర్నమెంట్ నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. చీనాబ్ నదిపై 515 మీటర్ల పొడవు మరియు 359 మీటర్ల ఎత్తు తో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ను మిగిలిన భారతదేశన్ని కలుపుకుంటూ తీవ్రవాదాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది.
35 వేల కోట్ల భారీ అంచనా తో నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలో అతి ఎత్తైనది. ఈ రైల్వే బ్రిడ్జి ఉదయపూర్ - శ్రీనగర్ - బారాముల్లా మార్గంలో నిర్మించారు. చీనాబ్ నది 960 కిలోమీటర్లు పొడవుతో భారతదేశం మరియు పాకిస్థాన్ లో విస్తరించింది, ఈ నదికి చంద్రబాఘ అని మరో పేరు కూడా ఉంది. ఈ వంతెన నిర్మాణం 2003లో మొదలుపెట్టారు అయినప్పటికీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు మరియు టెర్రరిజం కారణంగా చాలా సార్లు వాయిదా పడడం జరిగింది. 2017లో మరల వంతెన నిర్మాణం మొదలుపెట్టగా 2018లో మరల నిర్మాణం కార్యక్రమం తగ్గుముఖం పట్టింది. 2019 నుండి నిర్మాణ కార్యక్రమాలు మళ్లీ జోరు అందుకున్నాయి.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలో మొత్తం 17 పిల్లర్స్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ 120 సంవత్సరాల జీవిత కాలం గల సామర్థ్యం కలది. ఈ బ్రిడ్జ్ అక్కడ ఉన్న అతిక్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా నిర్మించారు. ఇది జమ్మూ కాశ్మీర్లో గల అత్యల్ప ఉష్ణోగ్రతను అనగా 10° నుంచి 40° వరకు తట్టుకోగలదు. అక్కడ గల అత్యంత తీవ్రమైన గాలులు కూడా తట్టుకునే విధంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రైల్వే బ్రిడ్జి 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు. ప్రకృతి విపత్తుల్లో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు రెక్టార్స్ స్కేల్ పై 8 పాయింట్స్ నమోదయ్యే భూకంపాన్ని కూడా ఈ బ్రిడ్జ్ సునాయాసంగా తట్టుకోగలదు.
ఈ బ్రిడ్జ్ వల్ల ఇప్పటివరకు ఆర్డినరీ ట్రైన్స్ కు పరిమితమైన జమ్మూ కాశ్మీర్ రైల్వే విభాగం ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ కూడా స్వాగతం పలుకుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల జమ్మూ కాశ్మీర్ కు మిగిలిన భారతదేశంలో రవాణా సదుపాయాలు పెరిగి అక్కడ ప్రజలకు జీవన అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ బ్రిడ్జ్ సదుపాయం వల్ల రాకపోకలు సునాయాసంగా జరగడం వల్ల అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఆర్టికల్ 360 ని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలవుతున్న ఏకైక రాష్ట్రం లేక కేంద్రపాలిత ప్రాంతం ఒక్క జమ్మూ కాశ్మీర్ మాత్రమే.
Narendra Modi Government
Post a Comment
0Comments