బడికి వచ్చే పిల్లల సంఖ్యను పెంచడానికి దీని ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచడానికి పథకం దోహదపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా గ్రామస్థాయిలో పిల్లల్లో ఉన్న పోషకాహార విలువలను పెంపొందించి పిల్లల్లో ఉండే పోషకాహారం లోపాన్ని ప్రభుత్వం అరికట్టడానికి ఈ పథకం ముఖ్య దోహదపడుతుంది. అదేవిధంగా బడిలో చదువుకునే పిల్లలందరూ ఒకే దగ్గర ఒకేలాంటి భోజనం చేయడం వల్ల వారిలో సమానత్వం భావాన్ని పెంపొందించగలమని ప్రభుత్వం యొక్క ఉద్దేశం.
ఈ పథకం ద్వారా గుర్తు చదువుకుంటున్న ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నము కూడా ఉచితంగా పోషక ఆహర విలువలు తో కూడిన భోజనాన్ని అందింపు చేస్తారు.
ఉచిత భోజనం వారంలో కేవలం ఆదివారం మరియు సెలవు దినాలు లలో ఉండదు. మిగిలిన పని దినాలులో సాధారణ సెలవులు మినహాయించి ప్రతిరోజు విద్యార్థులకు అందజేస్తారు. హార పట్టికలో కచ్చితంగా బియ్యం,పప్పులు,రాగి అంబలి, వేరుశనగ పలుకులు, బెల్లం, కూరగాయలు ఉండే విధంగా చర్యలు తీసుకుంది. ఈ మధ్యాహ్న భోజన పథకం తప్పనిసరిగా స్కూలు ప్రాంగణంలో లేదా స్కూలు చుట్టుపక్కల ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్నారు. చాలామందికి ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న డొక్కా సీతమ్మ గారి పేరును ఈ పథకానికి పెట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహనీయుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం ద్వారా వారు చేసిన మంచి స్ఫూర్తిదాయకంగా ప్రజలకు చేరుతుందని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.
Post a Comment
0Comments