NTR Bharosa Pension Scheme
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం మరో మహత్తర సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికింది. రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ కు శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు 3000 ఉన్న పెన్షన్ ను, 4000 నుండి 15000 వరకు పెంచినట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ - Society for Elimination of Rural Poverty (SERP) వారు 13 6 2024 తారీఖున విడుదల చేసిన తరికలలో ఈ సరికొత్త పెన్షన్ విధానాన్ని పేర్కొన్నారు.
- గత ప్రభుత్వంలో 3000 పెన్షన్ తీసుకుంటున్న వృద్ధాప్య, వితంతువులు, నేత కార్మికులకు, టాడీ టాపర్లు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్‌జెండర్లు, ART(PLHIV), డప్పు కళాకారులు మరియు కళాకారులకు పెన్షన్ ను 4000 పెంచారు.
- వికలాంగులకు మరియు లెప్రసీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ 3000 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంచడం జరిగింది.
- పూర్తిగా అంగవైకల్యం పొందిన వారికి 15000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (CKD) మరియు తలసిమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్ 10000 రూపాయలుగా నిర్ణయించింది.
ఈ పెన్షన్ ఏప్రిల్ 1- 2024 నుంచి అమల్లోకి వస్తాయి. జూలై 1 2024 నుండి సరికొత్త పెన్షన్ విధానం వల్ల లబ్ధి పొందిన పెన్షనర్లకు మూడు నెలలు బకాయిలతో కలిపి మొత్తం 7000 రూపాయలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెల నుంచి 4000 చొప్పున చెల్లించబడతాయి.
Post a Comment
0Comments