మీరు కొంటున్న బంగారు ఆభరణాలు హాల్ మార్క్ ఎలా సరిచూసుకోవాలి. మనం కొంటున్న బంగారు వస్తువులు షాప్ వాళ్ళు 916 హాల్ మార్క్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అవి నిజంగా హాల్ మార్క్ చేయవన్న మరియు 916 నాణ్యత కలిగిన వస్తువులు కాదో మనం మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత దేశ ప్రభుత్వం ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ BIS ( Bureau of Indian Standards) వారు నిర్వహిస్తారు. BIS CARE APP అప్లికేషన్ ను play-store నుండి dowload చేసుకోవచ్చు.
ఈ application లొ ఉన్న VERIFY HUID ఆప్షన్ ను open చేయాలి. ఇప్పుడు మనం కొన్న బంగారు వస్తువు పై ఉన్న HUID నెంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇప్పుడు అక్కడ ఉన్న నెంబర్ ను application లో enter చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనం కొన్న బంగారు ఆభరణం యొక్క వివరాలు అక్కడ వస్తాయి, దాని ద్వారా మనం కొన్న వస్తువు యొక్క నాణ్యత తెలుసుకోగలం.
Post a Comment
0Comments