తిరుమల లడ్డు ప్రసాదం పుట్టినరోజు, Agust 2

NDA NEWS
By -
0

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అంటే తెలియని వారే ఉండరు. కానీ ఆలూరు లడ్డూ ప్రసాదం గురించి పూర్తిగా ఎంతమందికి తెలుసు. ఆగస్టు 2 శ్రీవారి లడ్డూ ప్రసాదం పుట్టినరోజు. శ్రీవారికి లడ్డూ ప్రసాదం ఆగస్టు 2 1715 వ సంవత్సరం నుంచి నైవేద్యంగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత ప్రాచుర్యం పొందిన లడ్డు ప్రసాదం ఇంకెవరు నకిలీ తయారు చేయకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం 2009 హక్కు పొందింది. 
ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే శ్రీవారి నైవేద్యం అయిన లడ్డు పేరుపై పోస్టల్ స్టాంప్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 

తిరుమలలో ఉండే లడ్డు తయారీ కర్మాగారంలో మొత్తం 620 కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వీరిలో 247 మంది కేవలం వంటవారు. ఈ లడ్డు తయారీలో ఉపయోగించే అన్ని వస్తువులు చాలా జాగ్రత్తగా సేకరిస్తారు, అంతే కాకుండా ఈ వస్తువులు ప్రత్యేకంగా సేంద్రీయ పద్ధతిలో తయారు చేయిస్తారు. ఈ లడ్డు కర్మాగారంలో సుమారుగా 2.8 లక్షలు లడ్డూలు తయారవుతుంటాయి. ఈ లడ్డు కర్మాగారం రోజుకు 8 లక్షల లడ్డులు తయారు చేసే సామర్థ్యం గలదు. ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవారి లడ్డు నైవేద్యం ఇంకా ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)