ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రులుగా తమ మొదటి సంస్కరణ క్రింద ఉద్యాన శాఖలో రైతులకు అధిక మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల అటవీ మరియు ఉద్యాన శాఖ కార్యదర్శులు మరియు అధికారులతో జరిగిన సమావేశంలో అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఉద్యాన వ్యవసాయ చేసే రైతుల కోసం మేలు చేసే విధంగా ఒక ఆలోచనను ప్రవేశపెట్టతున్నట్లు అధికారులకు తెలియజేశారు.
ఇప్పటివరకు ఉద్యాన రైతులు సాగు కోసం చాలా ఖర్చు వెచ్చించి పంటలు పండించేవారు, ఇలా వాళ్లపై చాలా వరకు కూలీల భారం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నూతన అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు MGNREGS ( మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీం) అనగా ఉపాధి హామీ కూలీలను ఉద్యాన వ్యవసాయానికి వాడుకునే విధానాన్ని తీసుకురావడానికి చర్యలు చేపట్టవలసిందిగా అధికారులకు సూచించారు. ఈ చర్య వల్ల ఉద్యాన వ్యవసాయదారులు వ్యవసాయం మొదట్లో చేసే గుంతలు త్రవ్వటం, మొక్కలు నాటడం, నీరు పోయడం, కలుపులు తీయటం వంటి చాలావరకు కూలీలపై ఆధారపడే పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా చేయించి రైతులు పై ఆ భారాన్ని పూర్తిగా తొలగించడానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త నిబంధనను రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ సరికొత్త సంస్కరణ వల్ల గ్రామాలలో చాలామంది ప్రజలు ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందవచ్చు అంతేకాకుండా రైతులు కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్న కూలీలతో చేసే పనులను నుండి సహాయం అందుతుంది. అంతేకాకుండా అత్యంత లాభాలను ఆర్జించగల ఉద్యాన వ్యవసాయానికి రైతులను ఆకర్షించే విధంగా దోహదపడుతుంది. ఇకపై ఉపాధి హామీ పనులలో గుర్తించేటప్పుడు ఉద్యాన వ్యవసాయ రైతులను లబ్ధిదారులుగా గుర్తించి ఆ పనులను గ్రామాల్లో ఉండే ఉపాధి హామీ కూలీలచే చేయించవలసి వస్తుంది. త్వరలో ఈ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సూచించారు.
Post a Comment
0Comments