నూతన ఇసుక విధానానికి శ్రీకారం చుట్టుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయనుంది. ఈ నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుక ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఇసుకకు సంబంధించి ఎటువంటి రుసుమును ప్రభుత్వం స్వీకరించదు కానీ ఇసుక సరఫరాకు అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు ప్రజలు భరించాల్సి ఉంది. సొంత వాహనం కలిగిన వారు మాత్రం సరఫరా ఖర్చుల నుంచి మినహాయింపు ఉంటుంది వారు ఇతర ఖర్చులు చెల్లిస్తే సరిపోతుంది.
నూతన ఇసుక విధానం ప్రకారం ఒక కుటుంబానికి, ఒక వారానికి, 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇసుక విధానాల్లో ఉన్న లోపాలను సవరిస్తూ నూతన ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇసుక ప్రయాణానికి ఉపయోగించబోయే వాహనాలకు జిపిఎస్ ను అమర్చడం తప్పనిసరిగా చేసింది. ఒక కుటుంబానికి ఎంత ఇసుక సరఫరా చేయాలా అన్నది వారు ఆ ఇసుకను ఏ పని కోసం ఉపయోగిస్తారో ముందుగానే ప్రభుత్వానికి తెలుపవలసి ఉంటుంది. నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన వెబ్ సైట్ ద్వారా ప్రజలు నేరుగా ఇసుకను బుక్ చేసుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుకను బుక్ చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇసుకను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వారు కడుపున ఇంటికి ప్లాన్ అప్రూవల్ (plan approval) చేసుకుని ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఈ విషయం (plan approval) పై మినహాయింపు ఉండే అవకాశం ఉంది.
ఇసుక బుక్ చేసువడానికి సమయం
1) గ్రామ సచివాలయం ద్వారా : ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు
2) వెబ్ సైట్ ద్వారా : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 వరకు.
ఇసుకను బుక్ చేసుకునే ప్రజలు ఇసుకను ఎక్కడికి సరఫరా చేయాలో ముందుగానే ఆ ప్రదేశం యొక్క జిపిఎస్ లొకేషన్ ని నమోదు చేసుకోవాలి. ముందుగా నమోదు చేసుకున్న ప్రదేశానికి మాత్రమే ఇసుక సరఫరా చేస్తారు. ఇసుక మనం బుక్ చేసుకున్న ప్రదేశానికి వచ్చిన తర్వాత ఓటీపీ (రిజిస్టర్ చేసుకున్న మొబైల్ కి వచ్చే) ద్వారా ఇసుక సరఫరా ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇసుక బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఇసుక మనం బుక్ చేసుకున్న ప్రదేశానికి సరఫరా చేసిన తర్వాత మాత్రమే రవాణా ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది.
మనకు సొంత వాహనం లేనిచో ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేస్తారు. ఇసుకను మనకు అందుబాటులో ఉండే సరఫరా పాయింట్ నుంచి ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. రవాణాకు తీసుకునే రుసుమును ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. రమా నాకు అయ్యే ఖర్చులు ఈ క్రింది విధంగా ఉంటాయి.
Post a Comment
0Comments