సొంత భూమి లేకపోయినా రైతు భరోసా ,పీఎం కిసాన్ పొందే అవకాశం, CCRC Cards

NDA NEWS
By -
0
Crop Cultivation Right Cards,  CCRC CARDS FOR FARMERS 

      సొంత భూమి లేకపోయినా పీఎం కిసాన్ రైతు భరోసా వంటి పథకాలు కు లబ్ధి పొందవచ్చు అని చాలామంది రైతులకు అవగాహన ఉండదు. చివరి సంవత్సరం కేవలం 10% మంది కౌలు రైతులు మాత్రమే ఈ గుర్తింపు పొందారు. సొంతంగా భూమి లేకుండా కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సిసిఆర్సి (CCRC ) అనే గుర్తింపు కార్డును ఇస్తూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని లబ్ది లను అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అసలు  CCRC కార్డ్ అంటే ఏమిటి? వాటిని ఎలా పొందాలి ఆ కార్డ్స్ పొందడానికి అర్హతలు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

      కౌలు రైతులకు ప్రత్యేకంగా ఇచ్చే గుర్తింపు కార్డును సిసిఆర్సి (CCRC) కార్డ్ అని అంటారు. కౌలు రైతులు అంటే సొంతంగా భూమి లేకపోయినా, వేరే వారి దగ్గర నుంచి భూమిని తీసుకుని పంట పండించే వారిని కౌలు రైతులు అని పిలుస్తారు. వీరికి పొలంపై ఎటువంటి హక్కు ఉండదు. వీరు కేవలం పంటను పండించి ఆ వచ్చే పంటకు మాత్రమే హక్కుదారులుగా ఉంటారు. వేరొకరు భూమిలో పంటను పండించినందుకు ఆ పొలం యొక్క యజమానికి కొంత అద్దెని చెల్లిస్తారు. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ పథకాలు కేవలం నిజమైన యజమానులకు మాత్రమే గుర్తించేవి కానీ ఇప్పుడు ఇలా కవులు చేసుకుంటున్న రైతులకు కూడా అన్ని ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ సిసిఆర్సి కార్డ్ గుర్తింపు కలిగిన కౌలు రైతులకు పిఎం కిసాన్, రైతు భరోసా , ఇన్పుట్ సబ్సిడీ , మరియు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం సబ్సిడీలో విత్తనాలు పొందే అవకాశం , సబ్సిడీలో ఎరువులు పొందే అవకాశం , సబ్సిడీలో పురుగు మందులు పొందే అవకాశం ప్రభుత్వం ఈ కవులు రైతులకు కలిపిస్తుంది. 

     ఈ సిసిఆర్సి కార్డు పొందాలనుకుంటే ఆ కౌలు రైతు పొలం యొక్క యజమాని నుండి ఆమోదపత్రం తీసుకోవలసి ఉంటుంది. ఈ ఆమోద పత్రంతో పాటు ఆ పొలం యొక్క పాస్ బుక్ వివరాలు లేక 1B కాపీ, మరియు కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు కవులు రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రం (రైతు భరోసా కేంద్రం) లో గల అగ్రికల్చర్ అసిస్టెంట్ కి అందజేయాలి, లేదా ఆ పొలం పరిధిలో గల విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) కి అందజేయాలి. ఇలా సిసిఆర్సి కార్డు కోసం ఏ కౌలు రైతు అయిన నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత మనకు మండల స్థాయిలో ఉన్న అగ్రికల్చర్  మనకు మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారి మరియు రెవెన్యూ శాఖ అధికారి నుండి సిసిఆర్సి గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. 

ముఖ్య గమనిక

  • ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కేవలం మంజూరు చేసిన నాటి నుండి 11 నెలలు మాత్రమే వర్తిస్తుంది, 11 నెలలు తరువాత మరలా కౌలు రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి.
  • ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు వలన కౌలు రైతుకు ఇటువంటి హక్కు ఉండదు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)